Breaking News

‘మహీంద్రా’ ఇండియన్ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులకు 20 ఏళ్లు

Published on Wed, 03/12/2025 - 14:50

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (MASL) భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2005లో మహీంద్రా తొలిసారి ద్రాక్ష పండ్ల షిప్‌మెంట్‌ను యూరప్‌కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది.

సబోరో, ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్‌లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్‌లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్‌లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. దాంతో ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను మూడు రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందిస్తోంది. సంస్థకు నాసిక్‌లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా నాసిక్, బారామతి, సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.

ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్‌ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత

‘గత 20 ఏళ్లలో ద్రాక్ష వ్యాపారంలో సాధించిన వృద్ధి ఎంఏఎస్ఎల్‌కు గర్వకారణం. వ్యవసాయ వేల్యూ చెయిన్‌లో భాగంగా ద్రాక్ష సాగులో పరివర్తన తేవడంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. మా కృషి ఫలితంగా ఇతర దేశాలకు భారతీయ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. అలాగే ప్రాంతీయంగా వందల కొద్దీ రైతుల జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలిగాం’ అని ఎంఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ రామచంద్రన్ తెలిపారు. 6.5 ఎకరాల్లో, 75,000 చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన మహీంద్రా గ్రేప్ ప్యాక్ హౌస్‌లో నిత్యం 80 మెట్రిక్ టన్నుల ద్రాక్షలు ప్యాక్ చేస్తారు. ఇందులో 12 ప్రీకూలింగ్ చాంబర్లు, 170 ఎంటీ సామర్థ్యంతో రెండు కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఒక్కో షిఫ్టులో 500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. సుస్థిర సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నాసిక్‌లో ఎంఏఎస్‌ఎల్‌కు 15 ఎకరాల్లో డెమో ఫార్మ్ ఉంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు