Breaking News

ఏఐ, డ్రోన్‌లో ముందుంటాం

Published on Wed, 05/06/2026 - 08:20

పేరు మాత్రమే కాదు. బిజినెస్‌ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్‌– ఏఐ సర్వేలెన్స్‌ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్‌ క్లౌడ్‌ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు  బ్యాంకింగ్‌ సంస్థల నుంచి సర్వేలెన్స్‌ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్‌ నుంచీ  కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్‌ సుదీర్‌(జో)తో ‘సాక్షి’ బిజినెస్‌ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ... (రమణమూర్తి మంథా)

మీ బిజినెస్‌ వర్టికల్స్‌లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?

ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్‌పై ఫోకస్‌ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్‌డ్‌ సొల్యూషన్స్‌ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్‌ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్‌ సర్వీసుల కోసం కస్టమైజ్డ్‌ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్‌ పూర్తిగా మారుతుంది.  

మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?

ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్‌ క్లియర్‌గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్‌ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్‌ను తయారు చేసుకున్నాం. నంబర్స్‌ మాత్రం ఇపుడు చెప్పలేను.  

సరే! ఇప్పుడు మీ డ్రోన్‌ బిజినెస్‌ ఏ స్థాయిలో ఉంది?

దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్‌బుక్‌ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్‌ రంగానివే. డిజైన్‌ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్‌ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది.  

డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?

మేం 200 కిలోల వరకూ పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్‌ కావటం... జీపీఎస్‌ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్‌ వార్‌ఫేర్‌ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్‌ జామ్‌ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్నల్‌ నేవిగేషన్‌ వ్యవస్థల్ని  ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.

మీ రెవెన్యూలో రికరింగ్‌ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్‌ బేస్డ్‌ ఎక్కువా?

దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్‌ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది.  

మీ ఆర్డర్‌ బుక్, భవిష్యత్‌ వృద్ధిని వివరంగా చెబుతారా?

ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్‌ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.

మీ బిజినెస్‌లో అంతర్జాతీయ వాటా ఎంత?

గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం.  

మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?

అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్‌ అందిస్తున్నాం. ఆటోమేటెడ్‌ సర్వేలెన్స్‌ వ్యవస్థల్లో... రియల్‌టైమ్‌లో అలెర్ట్‌లు పంపటంలో... ఇంప్రూవ్‌మెంట్‌లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్‌ ఇలా మా వెర్టికల్స్‌ అన్నింటా ఏఐ తప్పనిసరి.  

మీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్‌ చేశారు కదా? ఫండింగ్‌ ఎలా?

ఎక్కువ భాగం ఫండింగ్‌ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్‌ ఫ్లో నుంచే ఫండింగ్‌ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్‌– పీఎస్‌యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం.  

కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?

గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్‌ఫామ్‌ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Videos

TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి

కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం

బాబొచ్చారు ఓటమి తెచ్చారు

ఆడపిల్లల మీద ఎలా నిందలు వేస్తారు..? ఏ తప్పు చేయలేదు

PMJ జ్యువెలరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ధర్మపురిలో దుండగుల సంచారం

సింహం సింగిల్ గా విజయ్ గెలుపు వెనుక 10 కారణాలు ..

ఎవరీ అధవ్ అర్జున? విజయ్ గెలవడానికి కారణం ఇతనేనా!

ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం

దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?

ఎంత చెప్పినా వినలేదు టీడీపీ నేతల దాడి పై రైతుల రియాక్షన్

Photos

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)

+5

మళ్లీ విజయం వేటలో..ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)