Breaking News

సిబిల్‌ సరిగా లేదని ఎస్‌బీఐ ఉద్యోగం రద్దు

Published on Fri, 06/27/2025 - 13:15

సిబిల్ స్కోర్‌ సరిగాలేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టులో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు, సిబిల్‌ స్కోర్‌ను పరిగణించి రిక్రూట్‌మెంట్‌ రద్దు చేశారు.

ఎస్‌బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మాద్రాస్‌ హైకోర్టులో ఆ అభ్యర్థి పిటిషన్‌ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్‌ హైకోర్లు ఎస్‌బీఐ చర్యలను సమర్థించింది. నియామక నోటిఫికేషన్‌లో స్పష్టంగా సిబిల్‌ స్కోర్‌, గత ఆర్థిక లావాదేవీల గురించి ఎస్‌బీఐ తెలిపిందని పేర్కొంది. జస్టిస్‌ ఎన్‌.మాలా ఈ కేసులో తీర్పు చెబుతూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు. ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్‌ క్లాజ్ (క్లాజ్ 1(ఈ)) ప్రకారం సిబిల్ లేదా ఇతర ఏజెన్సీల నుంచి నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ లేదా ప్రతికూల రిపోర్టులు ఉన్న అభ్యర్థులు అనర్హులని చెప్పారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్‌గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది.

ఇదీ చదవండి: పిక్సెల్‌ స్మార్ట్‌పోన్ల నిషేధం

సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు

  • క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.

  • లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.

  • మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.

  • క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.

  • సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)