Breaking News

రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

Published on Mon, 02/12/2024 - 20:45

చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం.

నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు.

1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది.

మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. 

ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)