Breaking News

లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు

Published on Tue, 10/15/2024 - 14:58

అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.

కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.

భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.

లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.

ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలు

సంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)