Breaking News

లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌.. మంచి లాభాలకు ఇదే రూట్‌!

Published on Sat, 03/01/2025 - 17:03

సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్‌ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్‌ ఎస్టేట్‌ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.

వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్‌ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్‌ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్‌ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.

మార్కెట్‌ సెంటిమెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్‌ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.

కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2030 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ అంచనా వేసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)