Breaking News

లగ్జరీ ఇళ్ల అమ్మకాలు డబుల్‌.. టాప్‌లో హైదరాబాద్‌!

Published on Wed, 11/08/2023 - 13:26

Luxury housing sales: దేశంలో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. ఖరీదు ఎక్కువైనా విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా  పెద్దపెద్ద నగరాల్లో ఈ ధోరణి ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్లు, అంతకంటే విలువైన లగ్జరీ నివాసాల అమ్మకాలు దాదాపు రెట్టింపైనట్లు రియల్‌ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (CBRE South Asia Pvt.Ltd) ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది.

ఈ రిపోర్ట్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా టాప్‌ ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ నెలల మధ్య కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 లగ్జరీ నివాసాలు అమ్ముడుపోగా ఈ ఏడాది వాటి సంఖ్య దాదాపు రెట్టింపై 9,200లకు చేరింది. 

మూడు నగరాల్లోనే 90 శాతం
ఢిల్లీ-నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, ముంబై, హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలలో మొదటి మూడు మార్కెట్లుగా ఉద్భవించాయి. మొత్తం టాప్‌ ఏడు నగరాల్లో జరిగిన అమ్మకాలలో దాదాపు 90 శాతం ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో దాదాపు 37 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ టాప్‌లో ఉండగా ముంబయి, హైదరాబాద్, పుణె వరుసగా 35 శాతం, 18 శాతం, 4 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి.

ఈ తొమ్మిది నెలల్లో నమోదైన పటిష్టమైన అమ్మకాల ఆధారంగా ఈ పండుగల సీజన్‌లో హౌసింగ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ కొత్త రికార్డును నెలకొల్పుతుందని, మొత్తం గృహాల విక్రయాలు 150,000 యూనిట్లను దాటతాయని అంచనా వేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)