Breaking News

ఖరీదైనవి కొంటున్నారా? కట్టండి పన్ను..

Published on Thu, 04/24/2025 - 07:40

న్యూఢిల్లీ: హ్యాండ్‌ బ్యాగ్‌లు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా వస్త్రాలు రూ.10 లక్షలు మించినవి మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిపై ఒక శాతం మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్‌) చేయనున్నారు. ప్రస్తుతం ఒక శాతం టీసీఎస్‌ రూ.10 లక్షలు మించిన మోటారు వాహనాలపైనే అమలవుతోంది. ఒక శాతం టీసీఎస్‌ వర్తించే విలాస వస్తువుల జాబితాను ఆదాయపన్ను శాఖ తాజాగా విడుదల చేసింది.

పెయింటింగ్‌లు, శిల్పాలు, పురాతన వస్తువులు, కాయిన్లు, స్టాంప్‌లు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు, కళ్లద్దాలు, పాదరక్షలు, క్రీడావస్త్రాలు, క్రీడా పరికరాలు, హోమ్‌ థియేటర్‌ సిస్టమ్‌లు, రేసింగ్‌ కోసం ఉద్దేశించిన గుర్రాల విక్రయ ధరపై ఒక శాతం టీసీఎస్‌ అమలవుతుంది. కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి ధరపై ఒక శాతం అదనంగా టీసీఎస్‌ను విక్రయదారులే వసూలు చేస్తారు. వారి పాన్‌ వివరాలు కూడా తీసుకుని, ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. కొనుగోలుదారులు ఆదాయపన్ను రిటర్నులు వేయడం ద్వారా తమ పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసుకోవచ్చు.

పన్ను చెల్లించే బాధ్యత లేకపోతే రిఫండ్‌ కోరొచ్చు. టీసీఎస్‌ రూపంలో ఆదాయపన్ను శాఖకు అదనంగా ఎలాంటి పన్ను ఆదాయం రాదు. కాకపోతే అధిక కొనుగోళ్ల వివరాలను పాన్‌ నంబర్ల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.  అధిక విలువతో కూడిన విచక్షణారహిత కొనుగోళ్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులను పెంచుకోవడం దీని లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)