Breaking News

ఎల్‌టీమైండ్‌ట్రీ లాభం ప్లస్‌.. 2,504 మందికి ఉద్యోగాలు

Published on Fri, 10/18/2024 - 08:16

ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్‌ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్‌సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్‌ చటర్జీ పేర్కొన్నారు.

ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్‌ కల్లా 742 మంది యాక్టివ్‌ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు