Breaking News

Q1 Results: లాభాల కంపెనీలు

Published on Fri, 07/18/2025 - 12:47

టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్‌ సొల్యూషన్ల దేశీ దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202526) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌జూన్‌(క్యూ1)లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 1,254 కోట్లను అధిగమించింది. గతేడాది(202425) ఇదే కాలంలో రూ. 1,134 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 9,841 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 9,143 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 83,889కు చేరింది. ఇసాప్‌లో భాగంగా ఉద్యోగుల సంక్షేమ నిధికి 67,252 షేర్లను కొత్తగా జారీ చేసేందుకు బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని తదుపరి దశలో అర్హతగల ఉద్యోగులకు బదిలీ చేయనుంది.

ఇండియన్‌ హోటల్స్‌ లాభం జూమ్‌

ఆతిథ్య రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202526) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌జూన్‌(క్యూ1)లో నికర లాభం 27 శాతం జంప్‌చేసి రూ. 329 కోట్లను అధిగమించింది.

గతేడాది(202425) ఇదే కాలంలో కేవలం రూ. 260 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 2,102 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,662 కోట్లకు పెరిగాయి. వరుసగా 13వ క్వార్టర్‌లోనూ రికార్డ్‌ ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్‌ చత్వాల్‌ పేర్కొన్నారు.

గైడెన్స్‌కు అనుగుణంగా ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. హోటళ్ల విభాగం నుంచి 14 శాతం అధికంగా రూ. 1,814 కోట్లు లభించగా.. 31.4 శాతం ఇబిటా మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో 12 ఒప్పందాలు కుదుర్చుకోగా.. కొత్తగా 6 హోటళ్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. హోటళ్ల పోర్ట్‌ఫోలియో 390కు చేరినట్లు వెల్లడించారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు