Breaking News

వచ్చే ఏడాది నుంచి పాన్ 2.0: పాత కార్డులు రద్దవుతాయా?

Published on Tue, 08/05/2025 - 14:48

పర్మనెంట్ అకౌంట్ నంబర్లు (PAN), టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్లు (TAN)కు సంబంధించిన అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 'పాన్ 2.0' (PAN 2.0) ప్రాజెక్ట్ అమలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 'ఎల్‌టీఐమైండ్‌ట్రీ' (LTIMindtree) సంస్థను ఆదాయ పన్ను శాఖ ఎంపిక చేసింది.

పాన్ 2.0 ప్రాజెక్ట్ అమలు కోసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. డిజైన్, డెవలప్‌మెంట్‌, కార్యకలాపాలు వంటి వాటితో పాటు నిర్వహణను కూడా ఎల్‌టీఐమైండ్‌ట్రీ చూసుకుంటుంది.

పాన్ సంబంధిత సేవల కోసం ప్రస్తుతం.. ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌, యూటీఐఐటీఎస్‌ఎల్‌ పోర్టల్‌, ప్రొటీన్‌ ఈ-గవర్నెన్స్‌ పోర్టల్‌ అనే ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే పాన్ 2.0 వీటన్నింటినీ ఒకే ఏకీకృత పోర్టల్‌గా అనుసంధానిస్తుంది. దీనికోసం నవంబర్ 2024న కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కంపెనీ రూ. 1435 కోట్లను కేటాయించింది.

ఇదీ చదవండి: FASTag Annual Pass: ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ

పాత పాన్ కార్డులు రద్దవుతాయా?
క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)