Breaking News

సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!

Published on Mon, 04/01/2024 - 09:15

రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్‌ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్‌ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్‌ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్‌లో విక్రయించవచ్చు. 

గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్‌ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్‌లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్‌గేయిన్స్‌తో స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్‌ ఇన్వెస్టర్ల​ పొందే వీలుంది. 

ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్‌పీఏలు ఉన్న రంగాలివే..

లాకిన్‌ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్‌, హోనాసా కన్జూమర్‌, సెల్లో వరల్డ్‌, జనస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఏప్రిల్‌ 1న గ్లోబల్‌ సర్ఫేసెస్‌, సాయి సిల్క్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లాటినం ఇండస్ట్రీస్‌, ఎక్సికామ్‌ టెక్నాలజీస్‌ షేర్ల లాకిన్‌ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్‌ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)