Breaking News

భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్‌ మహీంద్ర

Published on Sat, 02/11/2023 - 12:53

సాక్షి,ముంబై: జమ్మూ కశ్మీర్‌‌లో అపారమైన లిథియం నిక్షేపాలను కనుగొనడంపై పారిశశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ఇక సందేహం లేదు, భారతదేశం భవిష్యత్తు అంతా ఎలక్ట్రి ఫైయింగే అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో అత్యంత కీలకమైంది లిథియం, ఈ నేపథ్యంలోనే ఆనంద్‌ మహీంద్ర భవిష్యత్తులో ఈ-వాహనాల్లో భారత్‌ దూసుకుపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?)

దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. లిథియం నిక్షేపాల ఆవిష్కరణతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత దిగిరానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మొత్తం 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్ర గనుల శాఖ పేర్కొంది. నాన్-ఫెర్రస్ ఖనిజమైన లిథియం..ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడే కీలకమైన మూలకం.  భారీగా లిథియం నిల్వలగుర్తింపుతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని, ఫలితంగా డీజిల్‌, పెట్రోల్‌పై ఆధారపడడం ఇకపై  మరింత తగ్గుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.  (మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు ఇవే..)

కాగా ఈవీ కార్ల బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో లిథియం ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ బ్యాటరీలో ఉత్పత్తిపై చైనా వంటి దేశాల దిగుమతులపై ఆధారపడుతోంది ఇండియా. తాజా పరిణామంతో ఈవీల ఉత్పత్తి ఖర్చు ఖచ్చితంగా తగ్గుంనుందని బిజినెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కార్బన్‌ ఉద్గారాలు, మండుతున్న ఇంధన ధరల నేపథ్యంలో గ్లోబల్‌గా ఈవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)