‘బ్యాంకింగ్‌’కు బూస్ట్‌ ఇస్తారా?

Published on Tue, 01/28/2025 - 01:37

దేశ బ్యాంకింగ్‌ రంగం.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణాల్లో వృద్ధి బలహీనపడింది. డిపాజిట్లకు కస్టమర్లు మొహం చాటేస్తున్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగ్గడంతో, అధిక రేట్లపై డిపాజిట్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. ఫలితంగా బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. వీటికి పరిష్కార చర్యలు బడ్జెట్‌లో ఉంటాయన్న ఆశలు బ్యాంకింగ్‌ వర్గాల్లో నెలకొన్నాయి. 

ముఖ్యంగా లిక్విడిటీ పెంపు, రుణాల వృద్ధికి ఉద్దీపన చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి సెపె్టంబర్‌ త్రైమాసికంలో (2024–25) పడిపోవడం తెలిసిందే. ఈ ప్రభావం బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అన్‌ సెక్యూర్డ్‌ రుణాల్లో స్థూల, నికర నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వీటికి గణనీయమైన కేటాయింపులతో బ్యాంకుల లాభాలు తరిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

డిపాజిట్లకు ప్రోత్సాహకాలు 
→ ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లిపోతుండడంతో, తిరిగి సంప్రదాయ బ్యాంక్‌ డిపాజిట్ల వైపు వారిని ఆకర్షించేందుకు చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గృహ ఆర్థిక ఆస్తుల్లో బ్యాంకుల డిపాజిట్లు 2019–20 నాటికి 56.4 శాతంగా ఉంటే, 2024 మార్చి నాటికి 45.2 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌ డిపాజిట్లపై తక్కువ పన్ను రేటును ప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది. పన్ను ఆదా ఎఫ్‌డీపై ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ను తగ్గించినట్టయితే ఆకర్షణీయంగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు.             

→ ఆదాయపన్ను ఉపశమనంతో ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుంది. ఇది డిపాజిట్లు, రుణాలకు డిమాండ్‌ను పెంచుతుందున్న అంచనాలున్నాయి.
→ హోల్‌సేల్‌ రుణాలు, బ్యాంకింగ్‌ రంగం నుంచి నిరర్థక రుణ ఆస్తులను సొంతం చేసుకోవడంపైనా పన్ను రాయితీలు కల్పించాలని నిపుణులు కోరుతున్నారు.
→ సూక్ష్మ రుణాల విభాగంలో రుణ ఎగవేతలు ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుణ, నిర్వహణ వ్యయాల భారం ఎగసింది. ఈ పరిస్థితుల్లో అందు బాటు రేట్లపై ప్రత్యేక నిధుల విండోను ప్రకటించొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టులు భావిస్తున్నారు. 
→ అంతేకాదు మౌలికరంగ వసతుల కల్పన ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, రైల్వేలు, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం చేసే మూలధన వ్యయాలతో.. అన్ని రంగాల్లోనూ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని, ఇది బ్యాంకుల రుణ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. రానున్న బడ్జెట్‌లో 14 శాతం అధికంగా 11.3 లక్షల కోట్లను మూలధన వ్యయాల కింద కేటాయించొచ్చని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది.

రిటైల్‌ కస్టమర్ల నుంచి డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రోత్సాహకాలు కల్పించినట్టయితే బ్యాంక్‌లు తమ రుణ అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యయాలపై నిధులు సమీకరించగలుగుతాయి. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజీ రేషియోలో ప్రతిపాదిత మార్పుల నేపథ్యంలో ఇది ఎంతో అవసరం.
– సచిన్‌ సచ్‌దేవ, ఇక్రా ఫైనాన్షియల్‌ రంగం రేటింగ్స్‌ హెడ్, వైస్‌ ప్రెసిడెంట్‌

  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)