Breaking News

ముందు లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రూ.450 కోట్లతో ప్రచారం

Published on Thu, 07/03/2025 - 20:56

ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్‌సే పెహలే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్‌ కమిటీ ప్రారంభించింది.

అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా  రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్‌ కమిటీ చైర్మన్‌ కమలేష్‌ రావు తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్‌ 10వ స్థానంలో ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)