Breaking News

ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం

Published on Fri, 11/24/2023 - 04:44

న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్‌ రిటైల్‌ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మహంతి తెలిపారు.

డిసెంబర్‌ మొదటి వారంలో ఎల్‌ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్‌లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్‌ అష్యూర్డ్‌లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు.

ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు.

హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్‌) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)