Breaking News

ఎల్‌ఐసీ పాలసీ దారులకు శుభవార్త!

Published on Tue, 10/10/2023 - 18:16

లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్‌ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌ అక్టోబర్‌ 31,2023 వరకు కొనసాగనుంది. 

పాలసీ ల్యాప్స్‌ ఎప్పుడు అవుతుంది?
ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే  మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్‌ఐసీ రీవైవల్‌ క్యాంపెయిన్‌ని అందుబాటులోకి తెచ్చింది. 

ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు
ఈ క్యాంపెయిన్‌లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్‌ క్యాంపెయిన్‌లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్‌ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తుంది. 

అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. 

ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్‌సెషన్‌తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. 

పాలసీ ల్యాప్స్‌ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే?

♦ ఎల్‌ఐసీ పోర్ట్‌ల్‌ను ఓపెన్‌ చేయాలి

♦ అందులో రిజిస్టర్‌ యూజర్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

♦ సంబంధిత వివరాల్ని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వొచ్చు.

♦ లాగిన్‌ తర్వాత పాలసీ స్టేటస్‌ క్లిక్‌ చేయాలి

♦ స్టేటస్‌ క్లిక్‌ చేస్తే మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)