Breaking News

ఎల్‌ఐసీ లాభం జూమ్‌

Published on Fri, 11/07/2025 - 08:17

బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 32 శాతం జంప్‌చేసి రూ. 10,053 కోట్లను తాకింది. కమిషన్ల చెల్లింపు తగ్గడం ఇందుకు సహకరించింది.

గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 7,621 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,29,620 కోట్ల నుంచి రూ. 2,39,614 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,22,366 కోట్ల నుంచి రూ. 2,30,160 కోట్లకు పెరిగాయి. కమిషన్‌ చెల్లింపులు రూ. 6,542 కోట్ల నుంచి రూ. 5,772 కోట్లకు తగ్గాయి. కాగా.. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,19,901 కోట్ల నుంచి రూ. 1,26,479 కోట్లకు పుంజుకోగా.. రెన్యువల్‌ ప్రీమియం రూ. 61,910 కోట్ల నుంచి రూ. 64,996 కోట్లకు బలపడింది.  తొలి ఏడాది ప్రీమియం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 10,836 కోట్లకు క్షీణించింది. ఇందుకు జీఎస్‌టీ సవరణలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియంను 18% జీఎస్‌టీ నుంచి మినహాయించడం సానుకూల ఫలితాలను చూపనున్నట్లు ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ ఆర్‌.దొరైస్వామి పేర్కొన్నారు. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.72% నుంచి 1.34%కి తగ్గాయని చెప్పారు.

ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)