Breaking News

ఎల్‌ఐసీ లాభం తగ్గింది.. వాటి ప్రభావమే!

Published on Sat, 11/09/2024 - 07:24

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెలువరించింది. జులై–సెప్టెంబర్‌ (క్యూ2)లో నికర లాభం 4% క్షీణించి రూ. 7,621 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం తగ్గడం, కుటుంబ పెన్షన్‌లో రూ. 464 కోట్ల పెరుగుదల ప్రభావం చూపాయి.

గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 7,925 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు ఎగసింది. అయితే ఇతర ఆదాయం రూ. 248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ. 145 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు జంప్‌ చేసింది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,94,335 కోట్ల నుంచి రూ. 2,22,366 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.43 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై కన్ను 
ఈ ఆర్థిక సంవత్సరంలోగా స్టాండెలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా.. సరైన సంస్థ కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. మార్చిలోగా వాటా కొనుగోలుకు తుది రూపునివ్వనున్నట్లు వెల్లడించారు. టార్గెట్‌ సంస్థ విలువనుబట్టి ఎంత వాటా కొనుగోలు చేసేదీ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 1.6% నష్టంతో రూ. 915 వద్ద ముగిసింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)