Breaking News

ఎల్‌ఐసీ లాభం జూమ్‌

Published on Fri, 02/09/2024 - 04:09

న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది.

ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్‌ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్‌ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల్లో ఎల్‌ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది.
 

ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి