పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
Breaking News
ఫుల్ ఛార్జ్‌పై 580 కిమీ.. ఇదిగో లెక్సస్ కొత్త ఎలక్ట్రిక్ కారు!
Published on Sat, 03/21/2026 - 15:44
లెక్సస్ ఇండియా.. కొత్త తరం లెక్సస్ ES 500eని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ అందిస్తున్న మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం ఇదే. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లెక్సస్ ES 500e కారు 74.69kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 338bhp శక్తిని ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది, ఇది 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌పై 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ES డ్యూయల్ L-ఆకారపు LED DRLలతో అప్‌డేటెడ్ స్టైలింగ్ లాంగ్వేజ్‌ను అనుసరిస్తుంది. అయితే హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌పై దిగువన ఉన్నాయి. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు.. సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను పొందుతుంది. వెనుక భాగంలో లెక్సస్ అక్షరాలతో కూడిన ఒక సొగసైన కనెక్టెడ్ LED లైట్ బార్ ఉంటుంది.
లోపల, క్యాబిన్‌లో 12.3-అంగుళాల హుడ్‌లెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో లెవెల్ 2 ADAS, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 17-స్పీకర్ల మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ IRVM, సాఫ్ట్-క్లోజ్ డోర్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి.
Tags : 1