Breaking News

ఏఐ సొల్యూషన్స్, సర్వీసులపై లెనొవొ దృష్టి

Published on Fri, 09/26/2025 - 04:10

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ ఏఐ (కృత్రిమ మేధ) ప్రయోజనాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవాలని టెక్‌ దిగ్గజం లెనొవొ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా కేవలం పీసీలు మొబైల్స్‌లాంటి ఉత్పత్తులే కాకుండా ఏఐ ఆధారిత మౌలిక సర్విసులు, సొల్యూషన్స్‌ను విస్తృతంగా అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా ఎండీ అమిత్‌ లూథ్రా, ఈడీ రోహిత్‌ వెల్లడించారు. ఇతర ఆసియా పసిఫిక్‌ దేశాల్లోని సంస్థలు బ్యాక్‌–ఆఫీస్‌ అవసరాల కోసమే ఏఐని ఉపయోగిస్తుండగా, దేశీయంగా సేల్స్, మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్లు గణనీయంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.

భారత్‌లో ఇప్పటికే 53 శాతం సంస్థలు ఏఐ ఆధారిత పీసీలను వినియోగిస్తున్నట్లు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌పై (సీఐవో) నిర్వహించిన తమ అధ్యయనంలో వెల్లడైందని హైదరాబాద్‌లో తమ ఏఐ పోర్ట్‌ఫోలియోను డిస్‌ప్లే చేసిన సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దేశీయంగా పర్సనల్‌ కంప్యూటింగ్‌ ఉత్పత్తుల విభాగంలో రెండో స్థానంలో, ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ విభాగంలో మూడో స్థానంలో ఉన్నట్లు రోహిత్‌ చెప్పారు. భారత్‌లో 5 తయారీ ప్లాంట్లు, సుమారు 1,700 మంది సిబ్బంది ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 3.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదైందని ఆయన వివరించారు.

#

Tags : 1

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)