Breaking News

ఒరాకిల్‌‌లో ఏం జరుగుతుంది.. మరోసారి ఉద్యోగుల తొలగింపు షురూ!

Published on Fri, 06/16/2023 - 20:35

ఆర్ధిక మాంద్యం భ‌యాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖ‌ర్చు త‌గ్గించుకుంటున్నాయి.ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్‌ టెక్‌ కంపెనీ ఒరాకిల్ మరోసారి  లేఆఫ్స్‌కు తెరతీసింది. ఈ ఏడాది ప్రారంభంలో 3,000 మందిని ఫైర్‌ చేసిన టెక్ దిగ్గజం..తాజాగా,ఆ సంస్థకు చెందిన హెల్త్‌ విభాగం యూనిట్‌ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 

ఒరాకిల్‌ 2021 డిసెంబర్‌ నెలలో ఎల‌క్ట్రానిక్ మెడిక‌ల్ రికార్డ్స్‌ సంస్థ సెర్నెర్‌ను 28.3 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అనంతరం అవుట్‌ పేషెంట్స్‌కు ట్రీట్మెంట్‌, ఆర్మీ అధికారులకు జీవితకాలం హెల్త్‌ కేర్‌ సర్వీస్‌లను అందించే యూఎస్‌ ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రాజెక్ట్‌కు దక్కించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణ సమయంలో సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలెత్తాయి. కారణంగా యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ పలువురు పెషెంట్లతో కుదుర్చుకున్న ఒప్పొందాలు రద్దయ్యాయి. ఈ ఒప్పందాలు ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. 

తాజాగా, ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఒరాకిల్‌ తన సెర్నెర్‌లో పనిచేసే ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికే ఆ విభాగంలో కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు జారీ చేసిన జాబ్‌ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత ఉద్యోగుల‌కు ఒరాకిల్ నెల రోజుల వేత‌నంతో పాటు, ప్ర‌తి ఏడాది స‌ర్వీసుకు గాను అద‌నంగా ఓ వారం వేత‌నం, వెకేష‌న్ డేస్‌కు చెల్లింపుల‌తో కూడిన ప‌రిహార ప్యాకేజ్‌ను ఒరాకిల్ ఆఫ‌ర్ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. 
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)