స్వల్పంగా తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Published on Wed, 08/13/2025 - 09:37

ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్‌1 నుంచి ఆగస్ట్‌ 11 వరకు) రూ.6.64 లక్షల కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.6.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 3.95 శాతం మేర తగ్గినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమవుతోంది. రిఫండ్‌లు పెరగడం ఇందుకు కారణం. వ్యక్తులు, కంపెనీలు, వ్యాపార సంస్థలు చెల్లించే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి.

ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..

కార్పొరేట్‌ సంస్థల నుంచి నికర పన్నుల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థల నుంచి వచ్చిన ఆదాయం 7 శాతానికి పైగా పెరిగి రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. రూ.22,362 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో వసూలైంది. ఇదే కాలంలో రిఫండ్‌లు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్‌లకు ముందు స్థూల పన్ను వసూళ్లు రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)