Breaking News

4 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే

Published on Tue, 02/24/2026 - 08:38

రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా 4 కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇకపైనా ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..

తాజాగా నాలుగు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. వెరసి గతేడాది(2025) బాటలో కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగనుంది. జాబితాలో ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్, అంజలీ ల్యాబ్‌టెక్, ఏపీపీఎల్‌ కంటెయినర్స్, ఆలై్పన్‌ టెక్స్‌వరల్డ్‌ చోటు చేసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌లో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. ఐపీవో ద్వారా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే.  

మెడికల్‌ టెక్నాలజీ

పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్‌ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న మెడికల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 925 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 2.16 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా కంపెనీ సుమారు రూ. 3,500–4,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా కార్డియాక్‌ స్టెంట్ల తయారీ, పంపిణీ నిర్వహిస్తోంది. కార్డియోవాసు్కలర్‌ పరికరాలతోపాటు.. క్లినికల్‌ డయాగ్నోస్టిక్స్, సైంటిఫిక్‌ ల్యా»ొరేటరీ సొల్యూషన్స్‌ అందిస్తోంది. లిస్టింగ్‌లో కంపెనీ రూ. 11,000–13,000 కోట్ల విలువను ఆశిస్తోంది.  

కంటెయినర్‌ బిజినెస్‌

పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్న కంటెయినర్ల తయారీ కంపెనీ ఏపీపీఎల్‌ కంటెయినర్స్‌ కొత్తగా 12.5 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు సైతం 25.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంటెయినర్ల తయారీలో ఉన్న కంపెనీ 2025–26లో వీటి లీజింగ్‌ సర్వీసుల్లోకి సైతం ప్రవేశించింది. తద్వారా వివిధ క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన సరీ్వసులు సమకూర్చుతోంది.

వీవింగ్, స్పిన్నింగ్‌

టెక్స్‌టైల్స్‌ తయారీలో సమీకృత కార్యకలాపాలుగల గుజరాత్‌ కంపెనీ అల్పైన్‌ టెక్స్‌వరల్డ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా నేత(వీవింగ్‌), స్పిన్నింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్‌లో కొత్త వీవింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. తద్వారా గ్రే ఫ్యాబ్రిక్‌ తయారీకి వీలుగా ఉత్పత్తిని విస్తరించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.

కృత్రిమ వజ్రాల తయారీ

స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ల్యాబొరేటరీ వజ్రాల తయారీ కంపెనీ అంజలీ ల్యాబ్‌టెక్‌ 2025 అక్టోబర్‌లో సెబీకి గోప్యతా మార్గంలో దరఖాస్తు చేసింది. తాజాగా అనుమతి పొందింది. కంపెనీ ప్రధానంగా ల్యాబ్‌ డైమండ్లుసహా.. ల్యాబ్‌ డైమండ్‌ ఆభరణాలు, మైక్రోవేవ్‌ ప్లాస్మా సీవీడీ సిస్టమ్‌ తదితరాలను రూపొందిస్తోంది.


ఓమ్నిటెక్‌ ఇంజినీరింగ్‌ @ రూ.216–227

హైప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాల తయారీ కంపెనీ ఓమ్నిటెక్‌ ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 216–227 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 418 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్‌ ఉదయ్‌కుమార్‌ అరుణ్‌కుమార్‌ పరేఖ్‌ రూ. 165 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 583 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 24న షేర్లను ఆఫర్‌ చేయనుంది. మార్చి 5న లిస్ట్‌కానున్న కంపెనీ విలువ రూ. 2,800 కోట్లుగా నమోదయ్యే అవకాశముంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఎనర్జీ, ఆటోమేషన్, ఇండస్ట్రియల్‌ ఎక్విప్‌మెంట్‌ సిస్టమ్స్‌ తదితర రంగాల కస్టమర్లకు హైప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాలను రూపొందిస్తోంది. ఈ విభాగంలో ఆజాద్‌ ఇంజినీరింగ్, యూనిమెక్‌ ఏరోస్పేస్, డైనమాటిక్‌ టెక్నాలజీస్, ఎంటార్‌ టెక్నాలజీస్‌ తదితరాలతో పోటీ పడవలసి ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)