Breaking News

కంపెనీల కార్పొరేట్‌ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 05/04/2025 - 14:24

షాపర్స్‌స్టాప్‌ లాభం పతనం

రిటైల్‌ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 4 శాతం పెరిగి రూ. 1,090 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 77 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 4,628 కోట్లకు చేరింది.

ఈక్విటాస్‌ లాభం పతనం

ప్రయివేట్‌ రంగ సంస్థ ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(ఎస్‌ఎఫ్‌బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 80 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 208 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,685 కోట్ల నుంచి రూ. 1,869 కోట్లకు ఎగసింది. ప్రొవిజన్లు రూ. 107 కోట్ల నుంచి రూ. 258 కోట్లకు భారీగా పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2.61 శాతం నుంచి 2.89 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 1.17 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి.

ఇదీ చదవండి: లోకల్‌ కంటెంట్‌పై ఫోకస్‌.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి

లాటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ నికరలాభం రూ.51 కోట్లు

డిజిటల్‌ అనలిటిక్స్‌ కన్సల్టింగ్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ప్రొవెడర్‌ లాటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.51.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు 2023–24 ఇదే క్వార్టర్‌లో నికరలాభం రూ.45.23 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.187.45 కోట్ల నుంచి రూ.253.29 కోట్లకు పెరిగింది. ‘‘త్రైమాసిక ప్రాతిపదికన 1.9%, వార్షిక ప్రాతిపదికన 35.3 శాతం పెరుగుదలతో వరుసగా తొమ్మిదో సారి ఆదాయం వృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. బలమైన వ్యాపార మూలాలు, క్లయింట్లతో సత్సంబంధాలు మా స్థిరమైన పనితీరుకు నిదర్శనం’’ అని కంపెనీ సీఈవో రాజన్‌ సేతురామన్‌ తెలిపారు. 2025 మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ.173.49 కోట్లు, మొత్తం ఆదాయం రూ. 916.78 కోట్లుగా ప్రకటించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)