Breaking News

ఉద్యోగాలకు చలిగాలి

Published on Wed, 02/18/2026 - 08:55

నిరుద్యోగం జనవరిలో 5 శాతానికి పెరిగింది. 2025 డిసెంబర్‌లో ఇది 4.8 శాతంగానే ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు మించిన వారికి సంబంధించి నిరుద్యోగం జనవరిలో పెరిగినట్టు తెలుస్తోంది. కార్మికుల భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్‌), జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్‌) సైతం తగ్గడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సాగు కాలం ముగియడం వంటి సీజనల్‌ ప్రభావాలే ఎల్‌ఎఫ్‌పీఆర్, డబ్ల్యూపీఆర్‌ తగ్గడానికి కారణమని ఎన్‌ఎస్‌వో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు, రవాణా, వ్యాపార కార్యకలాపాలు శీతాకాలంలో నిదానించగా, పట్టణాల్లో మాత్రం వాణిజ్య కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి.  

  • గ్రామీణ నిరుద్యోగం గత డిసెంబర్‌లో 3.9 శాతంగా ఉంటే, జనవరిలో 4.2 శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి చేరింది. 

  • జనవరిలో కార్మికుల భాగస్వామ్య రేటు దేశవ్యాప్తంగా 55.9 శాతంగా నమోదైంది. డిసెంబర్‌లో ఇది 56.1 శాతంగా ఉంది. గ్రామీణ  ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్య రేటు 59 శాతం నుంచి 58.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 50.2 శాతం నుంచి 50.3 శాతానికి స్వల్పంగా మెరుగుపడింది.

  • మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరిలో 35.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం కాగా, పట్టణాల్లో 25.5 శాతంగా ఉండడం గమనార్హం. 

  • జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్‌) 2025 జూన్‌లో 53.3 శాతంగా ఉంటే, డిసెంబర్‌ నాటికి 56.7 శాతానికి మెరుగుపడగా.. 2026 జనవరిలో తిరిగి 56.2 శాతానికి బలహీనపడింది. 

  • గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సంబంధించి డబ్ల్యూపీఆర్‌ 75.7 శాతంగా, మహిళలకు సంబంధించి 38 శాతంగా ఉంది. పట్టణాల్లో పురుషులకు సంబంధించి 70.5 శాతం, మహిళలకు సంబంధించి 23 శాతం చొప్పున నమోదయ్యాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)