Breaking News

ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్

Published on Sun, 05/04/2025 - 16:10

ఇంటి ఆరోగ్యం, ఆనందం అంతా ఉండేది వంటగదిలోనే.. మరి అలాంటి వంటగదిని ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మార్చేయాలంటే.. ఇలాంటి గ్యాడ్జెట్స్‌ (కిచెన్‌ టీవీ, పిజ్జా ఓవెన్‌, ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌, థర్మా ‘మీట్‌’ర్‌) ఉండాల్సిందే!. ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కిచెన్‌ టీవీ
‘వంట చేయడం పెద్ద పనేం కాదు’ అని చేయి తిరిగిన నిపుణులు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఇదే మాటను వంట రాని వారు కూడా చెప్పగలరు. వాళ్ల వంటగదిలో ఈ ‘జీఈ కిచెన్‌ క్లబ్‌’ ఉంటే చాలు. ఇదొక స్మార్ట్‌ టీవీ లాంటిది. 27 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. వంటగదిలో దీనిని అమర్చుకుంటే, మనకు కావాల్సిన వంటను ఎలా వండాలో, ఏంమేం కావాలో, ఎంత మోతాదులో వేయాలో ఎప్పటికప్పుడు చూపిస్తూ, తెలియజేస్తుంది. మొబైల్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ధర 999 డాలర్లు (రూ. 85,301).

పిజ్జా ఓవెన్
ఆర్డర్‌ చేసిన అరగంటలో వచ్చే పిజ్జాను వెంటనే తినేయాలి, చల్లారితే అసలు బాగోదు. ఇంట్లో ఉంటే, వెంటనే ఓవెన్‌లో పెట్టి వేడి చేసుకొని తింటాం. అదే బయట ఉంటే.. సాధ్యం కాని పని. ఇందుకోసం ఈ ‘ఓనీ కోడా 2 పిజ్జా ఓÐð న్‌’ బాగా ఉపయోగపడుతుంది. ఇదొక గ్యాస్‌ పవర్డ్‌ పిజ్జా ఓవెన్‌. కేవలం పిజ్జాను మాత్రమే ఇందులో వేడి చేసుకొని తినొచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లవచ్చు. విహార యాత్రలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర 449 డాలర్లు ( రూ. 38,338).

ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఈ ‘ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌’ సాయంతో చాలా త్వరగా ఐస్‌ క్యూబ్స్‌ తయారు చేసుకోవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఐస్‌ క్యూబ్స్‌ తయారవుతాయి. బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. యాప్‌ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీని ధర 239 డాలర్లు (రూ. 20, 407) మాత్రమే!

థర్మా ‘మీట్‌’ర్‌
సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి మాంసం తినటం వలన శరీరంలోకి టేప్‌ వార్మ్‌లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, మాంసం సరిగ్గా ఉడికిందా లేదా అని తెలసుకోవడానికి రూపొందించినదే ఈ ‘మీట్‌ర్‌ ప్లస్‌’. దీనికున్న సూదికొనను మాంసానికి గుచ్చితే, కేవలం పదిసెకండ్లలోనే మాంసం ఎంత వరకు ఉడికిందో పూర్తి సమాచారం ఇస్తుంది. మాంసం లోపలి ఉష్ణోగత్రను సుమారు 212 డిగ్రీ ఫారన్‌హీట్‌ వరకు, బయటి ఉష్ణోగత్రను 527 డిగ్రీ ఫారన్‌ హీట్‌ వరకు చెప్పగలదు. బ్లూటూత్‌ కెనెక్టివిటీతో మొబైల్‌కు కూడా కనెక్ట్‌ చేసుకొని వాడుకోవచ్చు. ధర 99 డాలర్లు (రూ. 8,543).

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)