Breaking News

ఈ డిసెంబర్ 31 సో స్పెషల్‌! ఎందుకో తెలుసా?

Published on Sun, 12/31/2023 - 17:35

ఏటా డిసెంబర్‌ 31 తేదీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్‌ 31 మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ వందేళ్లకు గానీ ఇలాంటి తేదీ రాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అన్నది గూగుల్‌ ఇండియా తన అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త ఏడాది 2024 కి స్వాగతం పలుకుతున్నారు. అయితే 2023 డిసెంబర్‌ 31 తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాలు తేదీ/నెల/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తుండగా, అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో  నెల/తేదీ/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అమెరికా ఫార్మాట్‌లో 2023 డిసెంబర్ 31 తేదీని 12/31/23 గా రాస్తారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే 123123గా కనిపిస్తుంది. అంటే 123 అంకెలు రెండుసార్లు పునారావృతం అవుతాయి. ఇలాంటి క్రమం వందేళ్లకో సారి వస్తుంది. గతంలో 1923 సంవత్సరంలో వచ్చింది. మళ్లీ వందేళ్లకు అంటే 2123 డిసెంబర్ 31న వస్తుంది.

2023 డిసెంబర్‌ 31 తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజువల్‌ను షేర్ చేసింది. ''మీకు తెలుసా: ఇది చివరిసారి 1923లో జరిగింది. మళ్లీ 2123లో జరుగుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది.  ''123123 తేదీకి ఎందుకు అంత ప్రత్యేకత? 12/31/23 తేదీ నూతన సంవత్సర పండుగ. న్యూమరాలజీలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది. పునరావృతమయ్యే 123 సీక్వెన్స్‌ల కారణంగా ఇది డబుల్ మెసేజ్‌తో కూడిన రోజు. అందరూ కలిసి ముందుకు సాగడానికి, మంచి భవిష్యత్తును పొందడానికి నిపుణులు దీన్ని ఒక సమయంగా చూస్తారు” అని విజువల్‌లో పేర్కొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)