Breaking News

ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌

Published on Fri, 08/15/2025 - 16:03

ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం..  ఈ డీల్‌ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్‌కు చెందిన సైబర్‌ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.

యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్‌కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)