Breaking News

భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల దిగుమతి

Published on Thu, 09/05/2024 - 07:07

న్యూఢిల్లీ: దిగుమతి నిర్వహణ వ్యవస్థను అనుసరించి అనుమతి పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4 బిలియన్‌ డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 2023–24లో ఈ దిగుమతుల విలువ 8.4 బిలియన్‌ డాలర్లు. వీటిలో అత్యధికం చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

2023 అక్టోబర్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు, ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల దిగుమతుల కోసం ప్రభుత్వం దిగుమతి నిర్వహణ/అధికారీకరణను రూపొందించింది. మార్కెట్‌ సరఫరా దెబ్బతినకుండా దేశంలోకి ఈ వస్తువుల రాకను పర్యవేక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీని ప్రకారం దరఖాస్తు చేసుకుని పొందిన అనుమతులు 2024 సెప్టెంబర్‌ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.

10 బిలియన్‌ డాలర్లకుపైగా.. 
నూతన వ్యవస్థ అమలులోకి వచ్చిన తొలిరోజు 2023 నవంబర్‌ 1న 100కుపైగా దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో యాపిల్, డెల్, లెనోవో వంటి సంస్థలు ఉన్నాయి. 10 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన ఉత్పత్తుల కోసం ఇవి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 తర్వాత తదుపరి ఉత్తర్వుల కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలను పాటిస్తుందని అధికారి తెలిపారు. 2022–23లో భారత్‌కు 5.33 బిలియన్‌ డాలర్ల విలువైన పర్సనల్‌ కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. ఇందులో చైనా వాటా ఏకంగా 5.11 బిలియన్‌ డాలర్లు ఉంది. సింగపూర్, హాంగ్‌కాంగ్, యూఎస్, మలేషియా, తైవాన్, నెదర్లాండ్స్, వియత్నాం సైతం ఐటీ ఉత్పత్తులను భారత్‌కు సరఫరా చేస్తున్నాయి.

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)