బ్రిటన్‌ వీడనున్న బిలియనీర్?: కారణం ఇదే..

Published on Fri, 03/28/2025 - 14:11

చాలామంది ధనవంతులు పన్ను మినహాయింపులు కల్పించే దేశాలలో స్థిరపడటానికి మక్కువ చూపిస్తారు. ఇప్పటికే కొంతమంది బ్రిటన్‌లో స్థిరపడ్డారు. అయితే అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలులో ఉన్న 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ప్రముఖ పారిశ్రామికవేత్త 'లక్ష్మీ మిత్తల్' (Lakshmi Mittal) యూకే వీడనున్నారు.

నాన్-డోమ్ పన్ను విధానం అమలులో ఉన్నంత వరకు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పన్ను విధానాన్ని రద్దు చేస్తే.. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సుమారు రెండు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంగా ఈ పన్ను విధానం బ్రిటన్‌లో అమలులో ఉంది. కానీ ఇప్పుడున్న అక్కడి ప్రభుత్వం ఈ పన్ను విధానానికి మంగళం పాడనుంది.

యూకేలో కొత్త పన్ను విధానం అమలులోకి వస్తే, ధనవంతులు.. పన్ను విధించని యూఏఈ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలో ఎదో ఒకదానికి వెళ్లే అవకాశం ఉంది.

లక్ష్మి మిత్తల్ విషయానికి వస్తే.. స్టీల్ టైకూన్‌గా ప్రసిద్ధి చెందిన ఈయన యూకేలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు. గత సంవత్సరం సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో 14.9 బిలియన్ ఫౌండ్లతో ఏడవ స్థానంలో నిలిచారు. ఈయనకు లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లో ఒక భవనం, స్విస్ రిసార్ట్ పట్టణం సెయింట్ మోరిట్జ్‌లో ఒక ఛాలెట్‌తో సహా యూరప్, యుఎస్, ఆసియా అంతటా విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఈయన దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)