Breaking News

లార్సెన్ & టూబ్రో భారీ ఆర్డర్స్: ఏకంగా..

Published on Tue, 01/07/2025 - 19:20

లార్సెన్ & టుబ్రో (L&T) కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా.. మిడిల్ ఈస్ట్ నుంచి కూడా భారీ ఆర్డర్‌లను పొందింది. వీటి విలువ రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం.

పశ్చిమ బెంగాల్‌లో లేటెస్ట్ పంపిణీ నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి లార్సెన్ & టుబ్రో ఆర్డర్‌లను సొంతం చేసుకుంది. ఈ టెక్నాలజీ.. అవుటేజ్ నిర్వహణ వ్యవస్థ & పంపిణీ నిర్వహణ వ్యవస్థ కార్యాచరణలను కలపడం ద్వారా విద్యుత్ పంపిణీని మరింత స్మార్ట్‌గా చేయనుంది.

మీడియం, తక్కువ వోల్టేజ్ నెట్‌వర్క్‌ల రియల్ టైమ్ పర్యవేక్షణ మాత్రమే కాకుండా.. నియంత్రణ ద్వారా, లోపాలను త్వరగా వేరుచేయడం, వేగవంతమైన పునరుద్ధరణతో నెట్‌వర్క్ విశ్వసనీయత మెరుగుపడుతుంది.

ఇక మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) విషయానికి వస్తే.. కంపెనీ సౌదీ అరేబియాలో, సౌర ఉత్పత్తిని తరలించడానికి వీలు కల్పించే కీలకమైన 380 కేవీ సబ్‌స్టేషన్ కోసం ఆర్డర్ పొందబడింది. అదే విధంగా కువైట్‌లోని గ్రిడ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కంపెనీ 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఇదీ చదవండి: మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదే

దుబాయ్‌లో కూడా కంపెనీ 40/132 kV సబ్‌స్టేషన్‌తో సహా ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ (EHV) సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి అనేక ఆర్డర్‌లను పొందింది. ఈ ప్రాజెక్ట్‌లు దుబాయ్ పవర్ ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించే ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)