విశాఖలో టైమ్ పాస్ చేస్తున్న టీడీపీ MLA
Breaking News
రిటైల్ రుణాల పట్ల జాగ్రత్త
Published on Sat, 09/13/2025 - 08:42
భవిష్యత్తు రిటైల్ రుణాల విషయంలో బ్యాంక్‌లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగానికి చెందిన వెటరన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ సూచించారు. పోర్ట్‌ఫోలియో (రుణ ఆస్తులు) పరంగా అస్థిరతలు లేకుండా చూసుకోవాలని కోరారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కామత్ మాట్లాడారు.
కార్పొరేట్లు (కంపెనీలు) నిధుల కోసం బ్యాంకులపై ఆధారపడడం కొంత కాలానికి తగ్గుతుందంటూ.. భవిష్యత్తులో బ్యాంకులకు ప్రధాన వ్యాపారం రిటైల్ విభాగం నుంచే వస్తుందన్నారు. రిటైల్ విభాగంలో ఆస్తుల నాణ్యత వేగంగా క్షీణించే రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ రిస్క్ పోర్ట్‌ఫోలియో పరంగా అసమానతల రూపంలో ఎదురవుతుందన్నారు. బ్యాలన్స్‌షీట్లలో లోపాలు చోటుచేసుకుంటే అన్‌సెక్యూర్డ్ రుణాల్లో అధిక భాగం వసూలు కాకుండా పోతాయంటూ, బ్యాంక్‌లు ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.
ఫిన్‌టెక్‌లతో బ్యాంకులు పోటీపడక తప్పదన్నారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు ఫిన్‌టెక్‌లు రుణ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ రుణ విభాగంలో పరిమితికి మించి రుణ వితరణ (ఒకే వ్యక్తికి) ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయారన్న ఇటీవలి సెబీ డేటాను కామత్ ప్రస్తావించారు. నియంత్రణ సంస్థలు ఇప్పుడు దీన్ని కఠినతరం చేస్తున్నాయంటూ, ఈ చర్యలు ఫలితాన్నిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రుణ ఎగవేతలు పెరగొచ్చొని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.35,000 వరకు ఆఫర్
Tags : 1