Breaking News

సెలబ్రిటీల మనసుదోచే ఆ కారు మలయాళీ స్టార్ గ్యారేజిలో

Published on Sun, 06/04/2023 - 18:02

Kunchacko Boban Land Rover Defender: ప్రముఖ మలయాళీ నటుడు 'కుంచకో బోబన్' (Kunchacko Boban) ఇటీవల కొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కొనుగోలు చేశారు. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఇతడు దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసిన ఈ SUV ఇప్పుడు కుంచకో బోబన్ గ్యారేజిలో కూడా చేరింది. ఇది డిఫెండర్ 110 వెర్షన్‌ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 89.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నటుడు కొనుగోలు చేసిన ఈ కారు కస్టమైజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు.

సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ పూర్తిగా బ్లాక్ కలర్ పొందింది. అయితే రూప్ మాత్రం విభిన్నమైన కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన గ్యారేజిలో టయోటా వెల్‌ఫైర్, పోర్షే కయెన్, మినీ కూపర్ ఎస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఖరీదైన కార్ల జాబితాలోకి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ కూడా చేరింది.

(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?)

ల్యాండ్ రోవర్ డిఫెండర్
భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్స్‌లో లభిస్తుంది. అవి 110 వెర్షన్, 90 వెర్షన్. 110 వెర్షన్ అనేది 5-డోర్ మోడల్ కాగా, 90 వెర్షన్ అనేది 3-డోర్ వెర్షన్. కుంచకో బోబన్ కొనుగోలు చేసిన 110 వెర్షన్ 5 డోర్ మోడల్. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఆధునిక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌ కూడా పొందుతుంది.

(ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం)

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో లభిస్తుంది. డిఫెండర్ 110 అండ్ 90 వెర్షన్ల కోసం కంపెనీ 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)