Breaking News

కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ

Published on Wed, 02/07/2024 - 13:04

అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ..  కానీ ఇది రియల్‌ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ క్రెడ్‌ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది..

క్రెడ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని  ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు.

ఆసక్తికర ‘ఫిలాసఫీ’!
సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్‌ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్‌. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు..  12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో  డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని  అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.”

తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం,  సైబర్ కేఫ్‌ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు  కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌