Breaking News

స్మార్ట్‌ కే‘రింగ్‌’! మంత్రదండంలాంటి ఉంగరం

Published on Sun, 09/22/2024 - 12:45

ఇప్పటికే మార్కెట్‌లోకి కొన్ని రకాల స్మార్ట్‌రింగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ‘కుమీ టెక్నాలజీస్‌’ మిగిలిన స్మార్ట్‌రింగులను మించిన ఫీచర్లతో ‘కుమి రింగ్‌ హెచ్‌1’ పేరుతో మంత్రదండంలా పనిచేసే స్మార్ట్‌రింగును అందుబాటులోకి తెచ్చింది.

దీని తయారీకి మన్నికైన మైక్రోక్రిస్టలిన్‌ జిర్కోనియమ్‌ నానో సిరామిక్స్, యాంటీ బ్యాక్టీరియల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపయోగించడం విశేషం. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌రింగు బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, గుండె పనితీరు, రక్తపోటు వంటి వివరాలను ఇది ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని మార్పుల వివరాలను కూడా ఇది తెలియజేస్తుంది. ఇందులో ‘ఎస్‌ఓఎస్‌’ బటన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ‘ఎస్‌ఓఎస్‌’ బటన్‌ను నొక్కితే, వెంటనే ముఖ్యమైన కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తుంది. దీని ధర 199.99 డాలర్లు (రూ.16,788) మాత్రమే!

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)