Breaking News

కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు

Published on Fri, 11/15/2024 - 09:07

న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్‌ తయారీలో ఉన్న ఆస్ట్రియన్‌ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్‌ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.

‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్‌ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్‌లోని బజాజ్‌ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్‌మోటార్‌సైకిల్‌ జీఎంబీహెచ్‌ ఆసియా, పసిఫిక్, మిడిల్‌–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ పెర్బెర్‌స్లాగర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీ

అమ్మకాలలో భారత్‌ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్‌ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.

కొత్త బైక్‌లు ఇవే..
అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్‌ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు).

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)