రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్
Breaking News
రూ.40 వేలు పెరిగిన 390 డ్యూక్ ధర!
Published on Tue, 04/07/2026 - 17:27
భారతదేశంలో దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్న తరుణంలో.. కేటీఎమ్ ఇండియా కూడా తన 390 డ్యూక్ ధరను రూ. 40,000 పెంచింది. దీంతో ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 3.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.
2025 సెప్టెంబర్ చివరిలో.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 కింద ప్రవేశపెట్టిన సవరించిన జీఎస్టీ విధానం నేపథ్యంలో ఈ పెరుగుదల జరిగింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై ఇప్పుడు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. కాబట్టి ఇప్పుడు కంపెనీ బైక్ ధరను పెంచింది.
ఇదీ చదవండి: మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!
ప్రకటన వెల్లడించిన సమయంలో.. భారతదేశంలో బజాజ్ ఆటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేటీఎం ఇండియా, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ రెండూ.. తమ తమ 390 మరియు 400cc మోడళ్ల ధరలు యథాతథంగా ఉంటాయని, అదనపు ఖర్చులను కంపెనీయే భరిస్తుందని పేర్కొన్నాయి.
Tags : 1