Breaking News

కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!

Published on Mon, 08/11/2025 - 21:22

ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ తన డ్యూక్ ఫ్యామిలీని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. దేశీయ మార్కెట్లో కొత్త 'డ్యూక్ 160' లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కేటీఎమ్ డ్యూక్ 125 స్థానంలో లాంచ్ అయిన డ్యూక్ 160 బైక్ 164.2 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 rpm వద్ద, 19 bhp పవర్, 7500 rpm వద్ద 15.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కొత్త కేటీఎమ్ 160 బైకులోని చాలా భాగాలు కేటీఎమ్ 200 డ్యూక్‌ని పోలి ఉంటాయి. దీని ముందు భాగంలో అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో ప్రీలోడ్-సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 230 మిమీ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.

ఇదీ చదవండి: టెస్లా రెండో షోరూం ప్రారంభం

ఫీచర్స్ విషయానికి వస్తే.. కేటీఎమ్ 160 డ్యూక్ బైకులో కేటీఎమ్ కనెక్ట్ యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & కాల్/మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంది. ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ & సిల్వర్ మెటాలిక్ మాట్టే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)