Breaking News

కొఠారి ఇండస్ట్రియల్‌లో ఎఫ్‌జేకు వాటా

Published on Sun, 12/15/2024 - 07:56

చెన్నై:  నాన్‌లెదర్‌ ఫుట్‌వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌లో ఖతార్‌ సంస్థ ఎఫ్‌జే గ్లోబల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్‌ పేర్కొంది.

వెరసి కొఠారి ఇండస్ట్రియల్‌లో దోహా బ్యాంక్, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సంస్థల ప్రమోటర్‌ ఎఫ్‌జే గ్లోబల్‌ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.

అయితే ప్రమోటర్‌ రఫీఖ్‌ అహ్మద్‌ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్‌వేర్‌ తయారీ సంస్థ ఫీనిక్స్‌ కొఠారి ఫుట్‌వేర్‌లో అహ్మద్‌ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్‌ వెల్లడించింది. బీఎస్‌ఈలో కొఠారి ఇండస్ట్రియల్‌ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)