Breaking News

2025లో ఐపీవోల వెల్లువ

Published on Sat, 01/11/2025 - 08:22

ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్‌ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్‌ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.

2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగం టాప్‌ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ పేర్కొంది.

హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్‌ సర్వీసెస్, టాటా క్యాపిటల్‌ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్‌ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్‌ టెక్‌ కంపెనీలు ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్‌ఫ్రై తదితరాలు 5 బిలియన్‌ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది.  

ఇష్యూ పరిమాణం అప్‌ 
పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ  కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్‌ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.

గతేడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్‌ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్‌ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్‌సీలు సైతం దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)