Breaking News

కిరణ్‌ మజుందార్‌ షాకు జెంషెడ్‌జీ టాటా అవార్డు

Published on Sun, 12/15/2024 - 10:14

బయోకాన్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్‌జీ టాటా అవార్డు లభించింది. దేశంలో బయోసైన్సెస్ ప్రగతికి మార్గదర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ ప్రెసిడెంట్, టీక్యూఎం ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జనక్ కుమార్ మెహతా చేతుల మీదుగా మజుందార్-షా ఈ పురస్కాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ బి ముత్తురామన్, ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్, ఐఎస్‌క్యూ బెంగళూరు చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎన్ సుబ్రమణ్య పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ మజుందార్-షా మాట్లాడుతూ “ఐఎస్‌క్యూ అందిస్తున్న  2024 జంషెడ్‌‌జీ టాటా అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు గొప్ప దార్శనికుడి పేరుతో ఉంది. ఆయన వారసత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అన్నారు.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళ
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా  ఆమె 3.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.

  • #

  • #

  • #

  • #Biosciences

  • #QualityExcellence

  • #IndianSocietyForQuality

  • #LifetimeAchievement

  • #Biotechnology

  • #HealthcareInnovation

  • #

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)