Breaking News

దేశానికి సిగ్గుచేటు.. బంగారు బాతులను చంపేస్తున్నారు!

Published on Mon, 07/28/2025 - 10:13

గురుగ్రామ్‌, బెంగళూరుకు మధ్య కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయని బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలోని రెండు అత్యంత సంపన్న నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించాయని విమర్శించారు. కాలమిస్ట్, వ్యాపారవేత్త సుహేల్ సేథ్ గురుగ్రామ్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

అంతకుముందు సేథ్‌ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ..‘గురుగ్రామ్‌లోని మౌలిక సదుపాయాలు దేశానికి సిగ్గుచేటు. ఈ నగరం దేశ రాజధానికి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడి నగర పాలక సంస్థ అధికారులతీరు దారుణంగా ఉంది. గురుగ్రామ్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే ఎక్కువ మద్యం దుకాణాలు, పాఠశాలల కంటే బార్లు అధికంగా ఉన్నాయి. స్మార్ట్‌గా వ్యవహరించని నాయకులతో స్మార్ట్ సిటీల ఏర్పాటు సాధ్యం కాదు’ అని ఘాటుగా విమర్శించారు.

దీనిపై మజుందార్ షా ఎక్స్‌ ద్వారా స్పందించారు. ‘ధనిక నగరాల దుస్థితి ఇలాగే ఉంది. బెంగళూరు కూడా మరో గురుగ్రామ్‌లా మారుతోంది. మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేకుండా ప్రభుత్వం బంగారు బాతు(అభివృద్ధి చెందుతోన్న నగరాలు)ను దోచుకుని చంపేస్తోంది. డబ్బు సంపాదన కోసం భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు’ అని సేథ్‌ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు.

ఇదీ చదవండి: ఒకటికి మించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?

దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సరస్సులు, పచ్చదనం, సరైన ప్రణాళికతో కొత్త బెంగళూరును నిర్మించే అవకాశం ప్రభుత్వానికి లభించింది. కానీ ట్రాఫిక్‌, చెత్తాచెదారంతో కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘పట్టణ ప్రణాళిక అనేది ఒక డెడ్ డిపార్ట్‌మెంట్‌. బహిరంగ ప్రదేశాలపై సరైన నిబంధనలు లేవు. బెంగళూరు రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారాయి’ అని ఒకరు చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి 15-20 ఏళ్లుగా వింటున్నామని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)