దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న వజ్రాల వ్యాపారి

Published on Thu, 06/06/2024 - 15:52

దేశంలోని ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్‌ జెమ్స్‌ డైరెక్టర్‌ రాజేష్‌ లభుభాయ్‌ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.

త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్‌ ప్రీమియం రెసిడెన్షియల్‌ టవర్‌లో రాజేష్‌ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్‌కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్‌ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్‌ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్‌ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.

కాగా ఏప్రిల్‌ నెలలో కిరణ్‌ జెమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రమోటర్‌ మావ్‌జీభాయ్‌ పటేల్‌ ఇదే టవర్‌లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.  త్రీసిక్స్టీ వెస్ట్‌ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్‌-కార్ల్‌టన్‌ హోటల్‌ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్‌ పార్కింగ్‌ స్లాట్‌లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)