Breaking News

కైనెటిక్‌ ఫ్యామిలీ ఈ-స్కూటర్‌.. త్వరలో లాంచ్

Published on Sat, 09/07/2024 - 07:16

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్‌ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి తేనున్నట్టు ప్రకటించింది. 

2025 మార్చిలోగా ఎల్‌5 విభాగంలో ప్యాసింజర్‌ త్రీ–వీలర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.

మోటార్‌సైకిల్స్‌ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్‌ గ్రీన్‌ గత నెలలో గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ (జీపీసీ) నుంచి 25 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్‌ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.

లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్‌ కార్ట్‌ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్‌–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్‌ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్‌ కోసం అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ సొల్యూషన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు