Breaking News

కియా తొలి మోడల్‌.. 6 లక్షల కార్లు

Published on Wed, 02/18/2026 - 16:53

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్‌ (Kia Seltos) మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఉత్పత్తి 6 లక్షల యూనిట్లను అధిగమించినట్లు కియా ఇండియా ప్రకటించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తూ వస్తోంది. సెల్టోస్.. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి మోడల్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రెండో తరం వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

కియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సెల్టోస్ అమ్మకాలలో సుమారు 29 శాతం వాటా టాప్ వేరియంట్లదే. అధునాతన భద్రతా సాంకేతికతలు, అధిక సౌకర్యాలున్న ఫీచర్ రిచ్ వెర్షన్లను కస్టమర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.

సెల్టోస్‌ను ప్రారంభం నుంచే ప్రత్యేకతతో రూపుదిద్దినట్లు కియా ఇండియా పేర్కొంది. విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ ఈ ఎస్‌యూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. ఈ మోడల్‌లో మూడు 1.5 లీటర్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 115 హెచ్‌పీ శక్తినిచ్చే సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌‌ ఉన్నాయి.

ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా విస్తృత ఎంపికలు కల్పించింది. సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ; డీజిల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్; టర్బో పెట్రోల్‌కు 6-స్పీడ్ ఐఎమ్‌టి, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు.. ధర
ప్రస్తుతం సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.

ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ మాట్లాడుతూ.. “6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటడం వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు రంగాల్లో ఉన్న బలమైన పునాది కారణంగానే సెల్టోస్ ఈ స్థాయికి చేరుకుంది. మిడ్-ఎస్‌యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మోడల్‌గా ఇది నిలిచింది” అని తెలిపారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)