Breaking News

80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..

Published on Sun, 01/26/2025 - 17:33

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.

సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.

ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు