Breaking News

కియా నుంచి భారీ ఎలక్ట్రిక్‌ వ్యాన్‌ వచ్చేస్తోంది..

Published on Thu, 09/17/2026 - 11:57

ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో తన వాణిజ్య వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తోంది కియా. తన ప్రతిష్టాత్మక 'ప్లాట్‌ఫారమ్‌ బియాండ్‌ వెహికల్‌'(PBV) శ్రేణిలో భాగంగా రెండవ ఎలక్ట్రిక్‌ వ్యాన్‌ ‘PV7’ ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇదివరకే విడుదలైన చిన్న మోడల్‌ PV5 తర్వాత, భారీ సైజులో వస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ వ్యాన్ వ్యాపార, రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

బ్యాటరీ, రేంజ్.. ఛార్జింగ్

  • పవర్ అండ్ మోటార్: ఇందులో ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండి, దాదాపు 268 హెచ్‌పీ (200 kW) పవర్, 420 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  • బ్యాటరీ ఆప్షన్లు: ఇది 71.5 కిలోవాట్లు, 96.2 కిలోవాట్లు సామర్థ్యంగల NCM (నికెల్-కోబాల్ట్-మాంగనీస్) బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది.

  • డ్రైవింగ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 460 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

  • ఫాస్ట్ ఛార్జింగ్: వ్యాన్‌ను 800V E-GMP.S ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. 350kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 10% నుంచి  80% వరకు ఛార్జ్ అవుతుంది.

  • డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్స్: వాణిజ్యపరంగా సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ముందు వైపు AC/DC ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు వెనుక వైపు ఆప్షనల్ AC ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.

  • అదనపు సాంకేతికత: ఇందులో V2L (వెహికల్-టు-లోడ్) టెక్నాలజీ ఉంది. దీని ద్వారా వాహనం బ్యాటరీ నుంచి బయటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పవర్ టూల్స్‌కు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్‌ను కూడా తీసుకరానున్నారు.

పరిమాణం, డిజైన్

చిన్న మోడల్ PV5 డిజైన్ థీమ్‌తోనే వచ్చినప్పటికీ, PV7 భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. పొడవు 5,350 మిమీ, వెడల్పు 1,995 మిమీ, ఎత్తు 1,990 మిమీ, వీల్‌బేస్ 3,500 మిమీ ఉంటుంది.  ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సిల్వర్ యాసెంట్లతో కూడిన బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, C-ఆకారపు ఎల్‌ఈడీ డే-టైమ్‌ రన్నింగ్ లైట్లు (DRLs) దీనికి ఆధునిక లుక్‌ను ఇస్తాయి. ప్రయాణికుల వెర్షన్‌లో సాంప్రదాయ లిఫ్ట్-అప్ టైల్‌గేట్ ఉండగా, కార్గో మోడల్‌లో సామాన్లు వేగంగా నింపేందుకు వీలుగా ట్విన్-స్వింగ్ టైల్‌గేట్ ఆప్షన్ కూడా కలదు.

ప్యాసింజర్ & కార్గో మోడళ్లు

ప్యాసింజర్ వెర్షన్: అత్యధిక మార్కెట్లలో 7 నుండి 9 సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. అయితే దక్షిణ కొరియాలో 11 సీట్ల వెర్షన్ అందుబాటులోకి రానుంది. అవసరాన్ని బట్టి తీసివేసేందుకు (Removable) వీలైన సీటింగ్ అమరిక ఉంటుంది.

కార్గో వెర్షన్: వ్యాపార అవసరాల కోసం రూపొందించిన ఈ మోడల్ 1,200 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్, లాంగ్, హై-రూఫ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. సామాన్ల బరువును బట్టి వాహనం నడిచే విధానాన్ని సర్దుబాటు చేసే ‘హెవీ-లోడ్ డ్రైవింగ్ మోడ్’ కూడా ఇందులో ఇచ్చారు.

ఇంటీరియర్, ఇన్ఫోటైన్‌మెంట్ & సేఫ్టీ

కనెక్టివిటీ: ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే 14.6 అంగుళాల బిగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి.
ఫీచర్స్‌: క్యాబిన్‌లో యాంబియంట్ లైటింగ్, వెనుక ప్రయాణికులకు రూఫ్-మౌంటెడ్ ఎస్సీ వెంట్స్, ప్రతీ సీటు వద్ద100W USB-C ఛార్జింగ్ పోర్టులు ఏర్పాటు చేశారు.
సేఫ్టీ: ప్రయాణికుల భద్రత కోసం పైకప్పులో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌తో సహా మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

విడుదల ఎప్పుడంటే?

కియా PV7 ఎలక్ట్రిక్‌ వ్యాన్‌ను 2027 ద్వితీయార్థంలో ముందుగా దక్షిణ కొరియా, యూరప్‌ మార్కెట్లలో లాంచ్‌ చేయనున్నారు. ప్రస్తుతం దీనిని భారతదేశంలో విడుదల చేసే ఆలోచన ఏదీ లేదని సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. లాంచ్‌కు ముందే బుకింగ్‌లు

#

Tags : 1

Videos

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)