Breaking News

కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్

Published on Sun, 08/17/2025 - 21:19

సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఇండియాలో కియా కారెన్స్ క్లావిస్ & కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ చేసింది.

కియా ఇండియా లాంచ్ చేసిన ఈ రెండు కార్లు నాలుగు నెలల్లోనే 21,000 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. కారెన్స్ క్లావిస్ 20,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందగా.. క్లావిస్ ఈవీ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లను పొందింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

కియా కారెన్స్ క్లావిస్ మంచి డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, మూడవ వరుస యాక్సెస్‌ను సులభతరం చేయడానికి సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటివి పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ డిస్‌ప్లేలు, బోస్ 8 స్పీకర్ ఆడియో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్‌క్యామ్ వంటివి మాత్రమే కాకుండా  క్లైమేట్ కంట్రోల్/ఇన్ఫోటైన్‌మెంట్ స్వాప్ స్విచ్‌ వంటివి కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?

క్లావిస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. 42kWh యూనిట్ 404 కి.మీ రేంజ్ అందిస్తే.. 51.4kWh యూనిట్ 490 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. సేఫ్టీ పరంగా కూడా ఇవి రెండూ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)